Wednesday, 19 August 2026
  • Home  
  • సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు

సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్‌గార్డ్, నేవీ ఆధ్వర్యంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా రక్షణ చర్యలను మరింత వేగవంతం చేశారు.ఈ నేపథ్యంలో బుధవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు , డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి,జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయని భరోసా కల్పించారు.ఆగస్టు 3న ఓడలరేవు ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ నుంచి IND-AP-E8-MO-135 ‘ముత్యాలమ్మ’ బోటులో ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు. అనంతరం వారి ఆచూకీ తెలియకపోవడంతో సుమారు 300 నాటికల్ మైళ్ల పరిధిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.కోస్ట్‌గార్డ్‌కు చెందిన ఐదు నౌకలు, నేవీకి చెందిన రెండు నౌకలతో పాటు నేవీకి చెందిన రెండు అత్యాధునిక విమానాల ద్వారా సముద్రంలో గాలింపు కొనసాగుతోంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం తీర ప్రాంత రక్షణ విభాగాలతో అధికారులు సమన్వయం చేస్తున్నారు.పారాదీప్‌కు సుమారు 15 నాటికల్ మైళ్ల దూరంలో ముత్యాలమ్మ పేరుతో పసుపు రంగు బోటు గుర్తించబడింది. అది గల్లంతైన మత్స్యకారులు ప్రయాణించిన బోటేనా అనే విషయాన్ని ప్రత్యేక బృందాలు పరిశీలిస్తున్నాయి.గల్లంతైన బోటులో సుమారు 1,000 లీటర్ల డీజిల్, 20 రోజులకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నట్లు సమాచారం ఉంది. ప్రస్తుతం సముద్ర వాతావరణం అనుకూలంగా ఉండటంతో మత్స్యకారులు క్షేమంగా ఉండే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులకు అధికారులు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తున్నారు. మత్స్యకారుల ఆచూకీ లభించి, వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చే వరకు గాలింపు మరియు రక్షణ చర్యలు ఎలాంటి విరామం లేకుండా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.