శ్రీ కాళహస్తి, ఆగస్టు 19, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తన సతీమణి బొజ్జల రిషిత రెడ్డితో కలిసి బుధవారం నాడు తిరుమల క్షేత్రానికి విచ్చేసి కలియుగ వైకుంఠనాథుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మహాద్వారం గుండా ప్రవేశించిన ఎమ్మెల్యే దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. రంగనాయకుల మండపంలో ఆలయ వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, అర్చకులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి పవిత్ర తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏడుకొండలవాడి సన్నిధిలో పూజలు జరిపించుకోవడం ఎంతో ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించిందన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సకల అష్టైశ్వర్యాలతో విరజిల్లాలని, నియోజకవర్గం అన్ని రంగాలలో మరింత అభివృద్ధి పథంలో పయనించాలని ఆ వేంకటరమణుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మాజీ మంత్రి, టీటీడీ బోర్డు మెంబర్, తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, తుడా చైర్మన్, తిరుపతి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డిలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గ పరిధిలోని పలు రాజకీయ, ప్రగతి పరిణామాలపై ఆత్మీయంగా చర్చించారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమంలో, ప్రజాసేవలో అందరూ సమష్టిగా ముందుకు సాగేందుకు ఆ ఏడుకొండలవాడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

శ్రీవారి సేవలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దంపతులు-నియోజకవర్గ ప్రగతికి ప్రత్యేక ప్రార్థనలు