పున్నమి న్యూస్ ప్రతినిధి ఆగస్టు 19 ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, గౌరవనీయులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ యువజన విభాగ అధ్యక్షునిగా డాక్టర్ మేరీగ రేవంత్ చక్రవర్తినియమితులయ్యారుడాక్టర్ మేరీగా రేవంత్ చక్రవర్తి ఆదివారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివిటి సంజీవయ్య నిమర్యాదపూర్వకంగా కలిశారుఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పూలబొకే అందించి,ఆశీర్వాదాలు తీసుకున్నారు*
ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రేవంత్ చక్రవర్తికి కిలివేటి సంజీవయ్య హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ పలు సూచనలు చేశారు:యువతను సమాయత్తం చేయడం: నెల్లూరు నగరం మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్న యువతను వైఎస్సార్సీపీ వైపు ఆకర్షించి, వారిని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా భాగస్వామ్యులను చేయాలని కోరారు*.
పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తూ, ప్రజల సమస్యలపై యువజన విభాగం ముందుండి పోరాడాలని దిశా నిర్దేశం,చేశారు.తనకు సలహాలను సూచనలను ఇచ్చిన వహించిన కిలివేటి సంజీవయ్య కి డాక్టర్ రేవంత్ చక్రవర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు



