Monday, 17 August 2026
  • Home  
  • *జాతీయ పండుగ పూజ్యతకు తిలోదకాలు!* *కాట్రేనికోన హైస్కూల్లో విజేతలకు ఖాళీ సర్టిఫికెట్ల పంపిణీ!* *కాట్రేనికోన స్కూల్ ఘటనపై విచారణ జరపాలి: జిల్లా విద్యాశాఖ అధికారులకు తల్లిదండ్రుల డిమాండ్
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

*జాతీయ పండుగ పూజ్యతకు తిలోదకాలు!* *కాట్రేనికోన హైస్కూల్లో విజేతలకు ఖాళీ సర్టిఫికెట్ల పంపిణీ!* *కాట్రేనికోన స్కూల్ ఘటనపై విచారణ జరపాలి: జిల్లా విద్యాశాఖ అధికారులకు తల్లిదండ్రుల డిమాండ్

కేంద్రమైన కాట్రేనికోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉపాధ్యాయుల తీవ్ర నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం బహిర్గతమై స్థానికుల, తల్లిదండ్రుల తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. విద్యార్థుల్లో దేశభక్తిని, ఉత్సాహాన్ని నింపేందుకు నిర్వహించిన ఆటల పోటీలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో ప్రతిభ కనబరిచిన 36 మంది విజేతలకు వేదికపై ప్రజాప్రతినిధులు, ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారని, అయితే తీరా ఇంటికెళ్లి చూసేసరికి ఆ ప్రశంసా పత్రాలపై కనీసం విద్యార్థి పేరు, తరగతి, కనీసం ప్రధానోపాధ్యాయురాలి సంతకం కూడా లేని ‘ఖాళీ’ సర్టిఫికెట్లు ఇవ్వడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏ ఒక్క ఉపాధ్యాయుడికి బాధ్యత అప్పగించినా కేవలం 20 నిమిషాల్లో పూర్తయ్యే చిన్న పనిని కూడా చేయకుండా, జాతీయ పండుగను ఇంత అగౌరవపరిచేలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండగా, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అంబ స్పందిస్తూ సమయాభావం వల్లే ఇలా జరిగిందని, ఆ సర్టిఫికెట్లను తిరిగి సేకరించి పూర్తి వివరాలు, సంతకంతో అందజేస్తామని వివరణ ఇచ్చినప్పటికీ, ఈ దారుణ నిర్లక్ష్యంపై జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపి, బాధ్యులైన ఉపాధ్యాయులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.