Sunday, 26 July 2026
  • Home  
  • జెడ్పీ బాలికల పాఠశాలలో ఘనంగా ‘మెగా పీటీఎం–4.0’
- తిరుపతి

జెడ్పీ బాలికల పాఠశాలలో ఘనంగా ‘మెగా పీటీఎం–4.0’

శ్రీ కాళహస్తి, జులై 24, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిలోని జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ ప్లస్‌లో శుక్రవారం ‘మెగా పీటీఎం–4.0’ (తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు కే. సుచరిత విద్యార్థుల విద్యా ప్రగతి, పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలను తల్లిదండ్రులకు వివరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాళహస్తి మండల జెడ్పీటీసీ కే. వెంకట సుబ్బారెడ్డి పాఠశాల పరిశుభ్రత, టాయిలెట్ల నిర్వహణను అభినందిస్తూ, అక్కడ విధులు నిర్వహిస్తున్న నలుగురు పారిశుద్ధ్య కార్మికులకు తన వంతుగా రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్ విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించగా, మాజీ కౌన్సిలర్ మినరల్ రవి విద్య ప్రాధాన్యతను వివరించారు. వన్‌టౌన్ ఎస్‌ఐ క్రమశిక్షణ, ఉన్నత విద్య అవసరంపై విద్యార్థులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.