Sunday, 26 July 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో భారీ జాబ్ మేళా.. 861 ఉద్యోగాలకు అవకాశం
- తిరుపతి

శ్రీకాళహస్తిలో భారీ జాబ్ మేళా.. 861 ఉద్యోగాలకు అవకాశం

శ్రీ కాళహస్తి, జులై 24, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో జూలై 30న శ్రీకాళహస్తిలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో పిచ్చాటూరు రోడ్డులోని ఎస్.వి.ఏ. ప్రభుత్వ పురుషుల కళాశాలలో ఉదయం 8 గంటల నుంచి ఈ మేళా జరగనుంది. జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్‌ను స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 12 ప్రముఖ బహుళజాతి సంస్థలు పాల్గొని 861కి పైగా ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులైన 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి అర్హతను బట్టి నెలకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం లభిస్తుందని వివరించారు. ఉద్యోగార్థులు జూలై 29లోపు https://naipunyam.ap.gov.in/ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని, “Build Your Resume” ద్వారా ఆధార్ ఓటీపీతో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, సిటిజన్ లాగిన్ ద్వారా జాబ్ మేళాకు దరఖాస్తు చేసి అడ్మిట్ కార్డు పొందాలని సూచించారు. ఇంటర్వ్యూ రోజున స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 8919889609, 7989509540, 9988853335 నంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.