గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్లో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో SHO బి. సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీసులు దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ జెండాకు గౌరవం తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి. సునీల్ కుమార్, సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణకు మరింత అంకితభావంతో విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.
ఇదిలా ఉండగా, విధి నిర్వహణలో ప్రతిభ, కర్తవ్యనిష్ఠ, ప్రజాసేవను గుర్తిస్తూ SHO బి. సత్యనారాయణకు గౌరవనీయులైన మంత్రి చేతుల మీదుగా రంగారెడ్డి కలెక్టరేట్లో కామెండేషన్ ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సేవలను అధికారులు అభినందించారు. ఫ్యూచర్ సిటీ పరిధిలో శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ – ఫ్యూచర్ సిటీ కమిషనరేట్





