రామవరం, ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి): అనపర్తి మండలం రామవరం గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామవరం పంచాయతీ కార్యాలయంలో, శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ, మండల కూటమి నాయకులు పాల్గొన్నారు.
అనంతరం రామవరం శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల నిర్వహించిన 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు వైజాగ్ జి.వి. గారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన నగదు బహుమతులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, అనపర్తి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, రామవరం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





