*నందిపేట్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జెండా వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దూడ వెంకటేష్ గారు జాతీయ జెండాను ఎగురవేసి దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 🇮🇳*
*ఈ కార్యక్రమంలో నందిపేట్ టౌన్ ప్రెసిడెంట్ కాంతం చిన్నయ్య గారు, నందిపేట్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం గారు, నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మంద మహిపాల్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పిప్పెర సాయి రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*



