పెనుబల్లి/ఖమ్మం
పెనుబల్లి మండలంలోని మండాలపాడు గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా నాయకులు ఓరుగంటి రాము తండ్రి కృష్ణయ్య గత బుధవారం గుండె పోటు తో మృతి చెందారు. విషయం తెలుసుకున్న TGIDC చైర్మన్ మువ్వా విజయ్ బాబు మండాలపాడు గ్రామానికి వెళ్లి ఓరుగంటి రాము కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణయ్య మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు


