గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్
ఈ-కేవైసీకి ఆగస్టు 16 డెడ్‌లైన్
హైదరాబాద్, ఆగస్టు 14: గ్యాస్ వినియోగదారులకు ముఖ్యమైన అలర్ట్. LPG గ్యాస్ e-KYC పూర్తి చేసేందుకు ఆగస్టు 16 వరకు గడువు ఉన్నట్లు సమాచారం. గడువు సమీపిస్తుండటంతో వినియోగదారులు వెంటనే e-KYC పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే మొబైల్ ద్వారా ఇంటి నుంచే ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
ఇందుకోసం సంబంధిత గ్యాస్ కంపెనీ అధికారిక యాప్‌తో పాటు Aadhaar Face RD యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇండేన్ వినియోగదారులు Indian Oil ONE, HP గ్యాస్ వినియోగదారులు HP Pay, భారత్ గ్యాస్ వినియోగదారులు Hello BPCL యాప్‌లో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో OTP ద్వారా లాగిన్ కావాలి.
తర్వాత LPG e-KYC/Aadhaar Authentication ఎంపిక చేసి ఆధార్ నంబర్ నమోదు చేసి ఫేస్ స్కాన్ పూర్తి చేయాలి. ఆథెంటికేషన్ విజయవంతమైతే యాప్‌లో మెసేజ్ లేదా గ్రీన్ టిక్ కనిపిస్తుంది. దీంతో e-KYC ప్రక్రియ పూర్తవుతుంది. వినియోగదారులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే e-KYC పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.



