యలమంచిలి, ఆగస్టు 14 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఏటికొప్పాక గ్రామానికి చివరన ఉన్న ఎస్సీ కాలనీలో సమస్యలు పేరుకుపోయాయి. కాలనీ వైపు ప్రధాన డ్రైనేజీ కాలువ చెత్తాచెదారం, మురుగుతో నిండిపోయి దుర్గంధభరితంగా మారింది. మురుగునీరు నిలిచిపోవడంతో దోమలు, ఈగల బెడద పెరిగి కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాలనీలో మంచినీటి ట్యాంక్ ఉన్నప్పటికీ సక్రమంగా నీటి సరఫరా జరగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి నీరు వస్తే మరోసారి రావడం లేదని, దీంతో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.
డ్రైనేజీ, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, రహదారులు తదితర సమస్యలను అధికారులు స్వయంగా గుర్తించి పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. ప్రతిసారి ప్రజలు సమస్య చెప్పే వరకు వేచి చూడకుండా, కాలనీపై ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత పరిష్కారాలు చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
గ్రామానికి చివరన ఉన్నామనే కారణంతో తమ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

ఎస్సీ కాలనీ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు? డ్రైనేజీతో పాటు మంచినీటి కష్టాలు
యలమంచిలి, ఆగస్టు 14 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఏటికొప్పాక గ్రామానికి చివరన ఉన్న ఎస్సీ కాలనీలో సమస్యలు పేరుకుపోయాయి. కాలనీ వైపు ప్రధాన డ్రైనేజీ కాలువ చెత్తాచెదారం, మురుగుతో నిండిపోయి దుర్గంధభరితంగా మారింది. మురుగునీరు నిలిచిపోవడంతో దోమలు, ఈగల బెడద పెరిగి కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో మంచినీటి ట్యాంక్ ఉన్నప్పటికీ సక్రమంగా నీటి సరఫరా జరగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి నీరు వస్తే మరోసారి రావడం లేదని, దీంతో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. డ్రైనేజీ, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, రహదారులు తదితర సమస్యలను అధికారులు స్వయంగా గుర్తించి పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. ప్రతిసారి ప్రజలు సమస్య చెప్పే వరకు వేచి చూడకుండా, కాలనీపై ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత పరిష్కారాలు చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామానికి చివరన ఉన్నామనే కారణంతో తమ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

