తూర్పుగోదావరిజిల్లా, రాజమహేంద్రవరం, (పున్నమి ప్రతినిధి)
రాజమండ్రి వెంకటేశ్వరనగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లో ఉంచిన రెండు కార్లు, ఒక జనరేటర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో స్థానికులు వెంటనే స్పందించి అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం తప్పిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రకాశంనగర్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

షార్ట్‌సర్క్యూట్‌తో రెండు కార్లు దగ్ధం
తూర్పుగోదావరిజిల్లా, రాజమహేంద్రవరం, (పున్నమి ప్రతినిధి) రాజమండ్రి వెంకటేశ్వరనగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లో ఉంచిన రెండు కార్లు, ఒక జనరేటర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో స్థానికులు వెంటనే స్పందించి అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం తప్పిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రకాశంనగర్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

