Wednesday, 12 August 2026
  • Home  
  • హర్ ఘర్ తిరంగా ర్యాలీని జయప్రదం చేయండి ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ
- ఖమ్మం

హర్ ఘర్ తిరంగా ర్యాలీని జయప్రదం చేయండి ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ

ఖమ్మం, ఆగస్టు 12: (పున్నమి ప్రతి నిధి) హర్ ఘర్ తిరంగా అభియాన్‌లో భాగంగా ఈ నెల 13వ తేదీ గురువారం ఖమ్మం నగరంలో నిర్వహించనున్న తిరంగా ర్యాలీని విజయవంతం చేయాలని ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు పేవలియన్ గ్రౌండ్ నుంచి ర్యాలీ ప్రారంభమై జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగుతుందని తెలిపారు. దేశభక్తిని చాటుతూ, జాతీయ ఐక్యతను ప్రతిబింబించేలా నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, విద్యార్థులు, దేశభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ జాతీయ జెండాతో ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తి, జాతీయ సమైక్యత సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ధనియాకుల వెంకట్ నారాయణ అన్నారు. ర్యాలీకి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం, ఆగస్టు 12:
(పున్నమి ప్రతి నిధి)

హర్ ఘర్ తిరంగా అభియాన్‌లో భాగంగా ఈ నెల 13వ తేదీ గురువారం ఖమ్మం నగరంలో నిర్వహించనున్న తిరంగా ర్యాలీని విజయవంతం చేయాలని ఖమ్మం టూ టౌన్ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు పేవలియన్ గ్రౌండ్ నుంచి ర్యాలీ ప్రారంభమై జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగుతుందని తెలిపారు.

దేశభక్తిని చాటుతూ, జాతీయ ఐక్యతను ప్రతిబింబించేలా నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, విద్యార్థులు, దేశభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ జాతీయ జెండాతో ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తి, జాతీయ సమైక్యత సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ధనియాకుల వెంకట్ నారాయణ అన్నారు. ర్యాలీకి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.