Monday, 10 August 2026
  • Home  
  • ఈ నెల 12న పెద్ద చింత రేవులలో భీమన అమావాస్య ప్రత్యేక పూజలు..
- జోగులాంబ గద్వాల

ఈ నెల 12న పెద్ద చింత రేవులలో భీమన అమావాస్య ప్రత్యేక పూజలు..

ఉత్తరాది మఠం పీఠాధిపతులచే ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు, రామాయణ ప్రవచనాలు…స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తునికి అన్న ప్రసాద పంపిణీ ఏర్పాటు… ఆలయ ప్రధాన అర్చకులు ఆధ్య చక్రవర్తి కేశవాచార్యులు..జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని పెద్ద చింతరేవుల గ్రామంలో 18వ శతాబ్దం నాటి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయము లో ఈ నెల 12న బుధవారం నాడు ప్రత్యేకంగా భీమన (అత్తి) అమావాస్య ప్రత్యేక పూజలు , ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆధ్య చక్రవర్తి కేశవాచార్యులు తెలిపారు. బుధవారం నాడు అమావాస్య పురస్కరించుకొని బ్రహ్మ ముహూర్తంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకం,విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు, పుష్పాలంకరణ,తమలపాత్ర ఆకు పూజలు,అష్టోత్తర నామావళి పూజలు,అర్చనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాది మఠం పీఠాధిపతులు ఉడిపి,పాలిమార్ పీఠాధిపతులు శ్రీ 1008 విద్యాదీశ తీర్థ శ్రీపాదుల వారు, శ్రీ 1008 విద్యా రాజేశ్వర తీర్థ శ్రీపాదుల వారు తెల్లవారుజామున ఆరు గంటలకు ఆంజనేయ స్వామి వారికి కృష్ణానది దండోదక స్నానం,సంస్థాన ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.9 గంటలకు తులసి పూజ, అర్చనలు,ఆకులు ఉన్నట్లు తెలిపారు.10.30 గంటల నుండి రామాయణ ప్రవచన కార్యక్రమం ఉన్నట్లు తెలిపారు.ఆలయంలో పవమాన హోమం,నవగ్రహ హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు హోమ, ఇతర పూజలలో భక్తులు పాల్గొనుటకు 94408 07109, 9959251123, 9449934567, 9440770020 సెల్ నెంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తునికి పెద్ద చింతరేవుల ఆంజనేయ స్వామి అన్నప్రసాద కమిటీ వారిచే అన్న ప్రసాదం,నీటి వసతి, అల్పాహారం 3పూటలు ఉదయము,మధ్యాహ్నం,రాత్రి వరకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ ప్రాంతంలోనీ భక్తులు అదిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృప కటాక్షాలకు పాత్రులు కాగలరని ఆయన కోరారు.

ఉత్తరాది మఠం పీఠాధిపతులచే ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు, రామాయణ ప్రవచనాలు…స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తునికి అన్న ప్రసాద పంపిణీ ఏర్పాటు…
ఆలయ ప్రధాన అర్చకులు ఆధ్య చక్రవర్తి కేశవాచార్యులు..జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని పెద్ద చింతరేవుల గ్రామంలో 18వ శతాబ్దం నాటి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయము లో ఈ నెల 12న బుధవారం నాడు ప్రత్యేకంగా భీమన (అత్తి) అమావాస్య ప్రత్యేక పూజలు , ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆధ్య చక్రవర్తి కేశవాచార్యులు తెలిపారు. బుధవారం నాడు అమావాస్య పురస్కరించుకొని బ్రహ్మ ముహూర్తంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకం,విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు, పుష్పాలంకరణ,తమలపాత్ర ఆకు పూజలు,అష్టోత్తర నామావళి పూజలు,అర్చనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాది మఠం పీఠాధిపతులు ఉడిపి,పాలిమార్ పీఠాధిపతులు శ్రీ 1008 విద్యాదీశ తీర్థ శ్రీపాదుల వారు, శ్రీ 1008 విద్యా రాజేశ్వర తీర్థ శ్రీపాదుల వారు తెల్లవారుజామున ఆరు గంటలకు ఆంజనేయ స్వామి వారికి కృష్ణానది దండోదక స్నానం,సంస్థాన ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.9 గంటలకు తులసి పూజ, అర్చనలు,ఆకులు ఉన్నట్లు తెలిపారు.10.30 గంటల నుండి రామాయణ ప్రవచన కార్యక్రమం ఉన్నట్లు తెలిపారు.ఆలయంలో పవమాన హోమం,నవగ్రహ హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు హోమ, ఇతర పూజలలో భక్తులు పాల్గొనుటకు 94408 07109, 9959251123, 9449934567, 9440770020 సెల్ నెంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తునికి పెద్ద చింతరేవుల ఆంజనేయ స్వామి అన్నప్రసాద కమిటీ వారిచే అన్న ప్రసాదం,నీటి వసతి, అల్పాహారం 3పూటలు ఉదయము,మధ్యాహ్నం,రాత్రి వరకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ ప్రాంతంలోనీ భక్తులు అదిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృప కటాక్షాలకు పాత్రులు కాగలరని ఆయన కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.