తన ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎం వాడకంపై అక్టోబరు 1 నుంచి కొత్త పరిమితులను ఎస్బీఐ తీసుకురానుంది. వేతన ఖాతా ఎస్బీఐలో ఉన్న వారికి, ఇతర బ్యాంకు ఏటీఎంలలో ప్రస్తుతం ఉన్న 10 ఉచిత లావాదేవీల పరిమితిని 5కు తగ్గించనుంది. ఆ పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి నగదు ఉపసంహరణకు రూ.23 ఛార్జీతో పాటు జీఎస్ట; ఇతర లావాదేవీలకు రూ.11తో పాటు GST వసూలు చేయనుంది.


