హైదరాబాద్: ఆగస్టు 9 (పున్నమి) ఉప్పల్, భాగయత్, ఆలివ్ గ్రాండ్, లో అహ్లాదా ఈవెంట్స్ శనివారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక నిర్వాహకులు మాట్లాడుతూ ప్రధాన మ్యూజిక్ మరియు డాన్స్ కొత్త వ్యక్తులతో పరిచయాలు, నెట్వర్కింగ్ అద్భుతమైన సంగీతం సరదా సంభాషణలు అహ్లాదం జామింగ్ సెషన్ మ్యూజిక్ మరియు కళాకారులు ఒకచోట చేరి కలిసి అడుతూ పాడుతూ ఆనందిస్తారని తెలిపారు. ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలు పుట్టినరోజులు, పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, సీమంతాలు (బేబీ షవర్స్), గృహప్రవేశాలు, వార్షికోత్సవాలు మరియు పండుగ అలంకరణల కోసం అందుబాటులో ఉన్నాయి. మీ వేడుకలను ప్రత్యేకంగా మరియు అద్భుతంగా నిర్వహించడానికి అహ్లాదా ఈవెంట్స్ సహాయపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మామిడాల అన్వేష్, సోమ సని చిద్విల రెడ్డి, వంకాయల తరుణ్ తదితరులు పాల్గొన్నారు.










