బద్రాద్రి కొత్తగూడెం చుంచుపల్లి మండలం ఆగస్టు 9, (పున్నమి ప్రతినిధి)
పెనగడప: గ్రామంలో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన పండుగల్లో ఒకటైన బోనాలను ఆషాఢ మాసంలో మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సమర్పించారు. కొత్త కుండలో అన్నం, పాలు, బెల్లం, నెయ్యితో వంట చేసి పసుపు, కుంకుమలతో అలంకరించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. మేళతాళాలు, డప్పు చప్పుళ్ల మధ్య పోతురాజు నృత్యాలు ఆకట్టుకున్నాయి. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామం సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు కోరుకున్నారు. బోనాల పండుగ గ్రామదేవతల భక్తి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది. జాతర సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.



