శ్రీ కాళహస్తి, ఆగస్టు 08, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిలో డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని ఎంపీ మద్దెల గురుమూర్తి స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి పట్టణ వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఏపీ Gen-Z War’ రిలే నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా పేరిట అర్హత లేని టీడీపీ కార్యకర్తలకు డీఎస్సీ ఉద్యోగాలు కట్టబెట్టిందని మండిపడ్డారు. కనీసం ఇంటర్ చదవని వారికి నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇస్తే విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన ఈ భారీ కుంభకోణంపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని, దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు నెలకు రూ.3,000 భృతి ఇస్తామని మోసం చేసిన ప్రభుత్వం, ఇప్పటివరకు బాకీ పడిన నిరుద్యోగ భృతితో పాటు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రతి సంక్షేమ పథకం పారదర్శకంగా అందిందని, ప్రస్తుతం ప్రజా సంక్షేమం పూర్తిగా మూలనపడిందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరూ తారక శ్రీనివాసులుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి-ఎంపీ గురుమూర్తి