(పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 25:
వేముల: గ్రామ సమాఖ్యల్లో ఆర్థిక పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు 2025–26 వార్షిక ఆడిట్ నిర్వహించారు. వెలుగు–డీఆర్‌డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆంజనేయులు మాట్లాడుతూ నిధుల వినియోగం, ఖర్చులు, రికార్డులను నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించారు.
సీవీ రెడ్డి & కో చార్టర్డ్ అకౌంటెంట్లు క్యాష్‌బుక్‌లు, లెడ్జర్లు, బ్యాంకు ఖాతాలు, వోచర్లు, బిల్లులు, రుణాలు, రికవరీ వివరాలను పరిశీలించారు. ఇప్పటికే గుర్తించిన ఆడిట్ అభ్యంతరాలను పరిష్కరించి డిజిటల్ రికార్డులను నవీకరించాలని లీగల్ కంప్లెయిన్స్ కమ్యూనిటీ కోఆర్డినేటర్ నాగార్జున సూచించారు. కార్యక్రమంలో మండల సమాఖ్య ప్రతినిధులు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, గ్రామ సమాఖ్యల ప్రతినిధులు పాల్గొన్నారు.









