Friday, 25 September 2026
  • Home  
  • చిక్కుడు ప్రభాకర్ సీనియర్ న్యాయవాది హోదా కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరువు
- తెలంగాణ - మహబూబాబాద్

చిక్కుడు ప్రభాకర్ సీనియర్ న్యాయవాది హోదా కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరువు

**సీనియర్ న్యాయవాది హోదాలో చిక్కుడు ప్రభాకర్* ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది *చిక్కుడు ప్రభాకర్ గారికి సీనియర్ న్యాయవాది హోదా కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.* పేద బడుగు బలహీనవర్గాల న్యాయవాదిగా చిక్కుడు ప్రభాకర్ కు ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో *వెంకటమ్మ రామయ్య దంపతులకు* చిక్కుడు ప్రభాకర్ 1968 లో జన్మించాడు. పాఠశాల విద్య స్టేషన్ ఘనపూర్, ఇంటర్ మీడియట్ ఆలేరు, డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కాకతీయ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర విద్య సుభాష్ చంద్రబోస్ కాలేజీలో పూర్తి చేసి 1998 లో ఉమ్మడి వరంగల్ జిల్లా కోర్టులో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి 2000 సంవత్సరం నుండి రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. రాష్ట్ర హైకోర్టులో ప్రజల రాజ్యాంగ బద్ధమైన అనేక కేసుల్లో పటిష్టమైన వాదనలు వినిపించి ప్రజల హక్కులను కాపాడి మన్ననలు పొందారు. రాష్ట్రంలో *’నిజాం షుగర్స్’* , *’ఆర్ టి సి’* ని ప్రైవేట్ పరం కాకుండా, ఎర్రగడ్డ లోని ఛాతి ఆసుపత్రి ఆవరణలో సచివాలయం నిర్మించకుండా, ఎర్రమంజిల్ భవన ప్రాంగణంలో అసెంబ్లీ భవనం కట్టకుండా పటిష్టమైన వాదనలు హైకోర్టులో చేసి ఘనవిజయం సాధించిన న్యాయవాది చిక్కుడు ప్రభాకర్. వరంగల్ ఆజం జాహి మిల్లు *కార్మికుల కోసం సుప్రీం కోర్టులో* చిక్కుడు ప్రభాకర్ వాదించి కార్మికులకు గృహ నిర్మాణ స్థలాలు ఉచితంగా ఇప్పించారు. 23,609 విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేయించి కార్మికుల జీతాల్లో వెలుగులు నింపి కార్మికులకు పక్షపాతిగా నిలిచారు. ముఖ్యంగా 2020 లో అంతర్జాతీయంగా వచ్చిన *కరోనా విపత్తు* సమయంలో అత్యంత ధైర్యసాహసాలతో హైకోర్టు లో *ప్రజల ఆరోగ్య భద్రత కోసం* వాదనలు చేసి ప్రభుత్వంచే ప్రజల్లో 99.8 % వాక్సినేషన్ వేయించి, మహమ్మారి కరోనా నివారణ చికిత్స కోసం ప్రభుత్వం తరుపున 3 ఆసుపత్రులుంటే, వాటి సంఖ్య 78 కరోనా వైద్య చికిత్స ఆసుపత్రులు పెంచేలా న్యాయస్థానం ద్వారా ప్రభుత్వానికి ఆదేశాలు ఇప్పించి నాలుగు కోట్ల ప్రజల ప్రాణాలు రక్షించేందుకు అహో రాత్రులు నిర్విరామంగా కృషిచేసి మానవీయ కోణంలో ప్రజలకు న్యాయం అండగా నిలుస్తుందని నిరూపించిన న్యాయవాది గా చిక్కుడు ప్రభాకర్ ప్రజలందరికీ సుపరిచితుడు. చిక్కుడు ప్రభాకర్ కు సీనియర్ న్యాయవాది హోదా కల్పిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు వెలువరించిన సందర్భంగా అతని చిన్ననాటి బాల్య మిత్రులు ప్రజా సంఘాల సహచరులు *ప్రజా న్యాయవాది చిక్కుడు ప్రభాకర్* కు అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.