చర్ల, ఆగస్టు 5: సురక్షక్ తిరంగా కార్యక్రమంలో భాగంగా చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పోలీస్ శాఖ, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా భద్రత, డిజిటల్ లావాదేవీల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్, చర్ల సీఐ రాజువర్మ, ఎస్సైలు పి. కేశవ్, ఆర్. నర్సిరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్, పలువురు జూనియర్ లెక్చరర్లు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు, లింకులను నమ్మవద్దని అధికారులు సూచించారు.
చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన సదస్సు