మహబూబ్‌నగర్: ఉపాధి హామీ (VB-G RAM G) ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు శనివారం రెండో రోజుకు చేరాయి. మహబూబ్‌నగర్ జిల్లా డిఆర్డిఏ (DRDA) కార్యాలయ సిబ్బంది విధులను బహిష్కరించి ‘పెన్‌డౌన్, షట్‌డౌన్’ పాటించారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలని నినాదాలు చేశారు. విధులు నిలిచిపోవడంతో పలు పరిపాలనా పనులు స్థంభించాయి. సమస్యలు పరిష్కరించే వరకు నిరసనలు ఆపేది లేదని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు.

మహబూబ్‌నగర్ DRDA లో పెన్‌డౌన్.. ఉపాధి పనుల బంద్