( *పున్నమి న్యూస్ ప్రతినిధి కృష్ణ*) జూలై 31 తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట జీవో నెం.396 ను రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్ల,స్టాంప్ వెండర్లు,టైపిస్టులు నిరసన కార్యక్రమం 12వ రోజు శుక్రవారం కొనసాగించారు.పాకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేశారు.పాకాల దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మురళి,సెక్రటరీ వెంకటముని,జాయింట్ సెక్రెటరీ యశ్వంత్ కుమార్,ఉపాధ్యక్షుడు అన్సర్ లు మాట్లాడుతూ ప్రభుత్వం తెచ్చిన జీ.ఓ నెం.396 వల్ల ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.సదరు జీ.ఓ వల్ల ప్రజల స్థిరాస్తులకు రక్షణ కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు.రాష్ట్రంలో లక్షలాదిమంది దస్తావేజు లేఖర్లు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు.ఆంధ్రప్రదేశ్,రాష్ట్ర )ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి కొణిదలపవన్ కళ్యాణ్,రెవెన్యూ,స్టాంపులు,రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్,స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని’లు చొరవచూపి జీ.ఓ రద్దుపరిచి న్యాయం చేయాలని కోరారు.కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు మదన్ మోహన్,చంద్రబాబు,కె.రెడ్డిహరీష,పూజిత,అరుణ,రాంబాబు,లత,విజయకాంత్,బాలరెడ్డప్ప,బాలాజీ,హరి,శ్రీనివాసులు,త్రివేణి,రజిని,ధరణి,లత,మిధున్,వాజిద్,హరి,తదితరులు పాల్గొన్నారు



