Wednesday, 29 July 2026
  • Home  
  • మెగా డీఎస్సీపై వైసీపీ విమర్శలు సిగ్గుచేటు: టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్
- E-పేపర్

మెగా డీఎస్సీపై వైసీపీ విమర్శలు సిగ్గుచేటు: టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్

మెగా డీఎస్సీపై వైసీపీ విమర్శలు సిగ్గుచేటు: టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్ పున్నమి ప్రతినిధి, కడప: మెగా డీఎస్సీపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు సిగ్గుచేటని, ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల శ్రమను, ప్రతిభను అవమానించే రాజకీయాలు మానుకోవాలని టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్ అన్నారు. బుధవారం కడప నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన వేలాది మంది యువత ప్రతిభను అవమానించేలా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అక్రమాలు జరిగాయని ఆరోపిస్తే వాటికి తగిన ఆధారాలు చూపాలని, లేకపోతే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేదని ఆరోపించిన ఆయన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేసి వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిందన్నారు. ఉద్యోగాలు వచ్చిన ఏడాది తర్వాత ఎలాంటి ఆధారాలు లేకుండా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా దుష్ప్రచారం చేస్తూ ర్యాలీలు నిర్వహించడం బాధాకరమన్నారు. నిరుద్యోగ యువత వైసీపీ పార్టీతో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే 16 వేలకుపైగా టీచర్ ఉద్యోగాలు, 6,100 కానిస్టేబుల్ పోస్టులు, 980 గ్రూప్-2 ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు మరో 10 వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు. ఈ విజయాన్ని జీర్ణించుకోలేక వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తూ విషప్రచారం సాగిస్తోందని విమర్శించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విసిరిన బహిరంగ చర్చ సవాల్‌కు సమాధానం చెప్పకుండా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బెంగళూరుకు వెళ్లిపోయారని, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగులను రెచ్చగొడుతూ ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను అవమానించేలా ఫేక్ ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలల్లో వైసీపీ పేటీఎం బ్యాచ్ ద్వారా భయాందోళనలు సృష్టించి విద్యార్థులను బలవంతంగా ర్యాలీలకు తరలించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఒక్క మెగా డీఎస్సీ కూడా నిర్వహించలేదని, జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో పూర్తిగా విఫలమైన వైసీపీ ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ దేశ, విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తున్నారని, గత ఐదేళ్లలో దెబ్బతిన్న రాష్ట్ర ప్రతిష్ఠను కూటమి ప్రభుత్వం పునరుద్ధరిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మిశెట్టి చంద్రశేఖర్, టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు సుమన్, దినేష్, కళ్యాణ్, గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మెగా డీఎస్సీపై వైసీపీ విమర్శలు సిగ్గుచేటు: టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్

పున్నమి ప్రతినిధి, కడప:

మెగా డీఎస్సీపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు సిగ్గుచేటని, ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల శ్రమను, ప్రతిభను అవమానించే రాజకీయాలు మానుకోవాలని టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్ అన్నారు.

బుధవారం కడప నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన వేలాది మంది యువత ప్రతిభను అవమానించేలా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అక్రమాలు జరిగాయని ఆరోపిస్తే వాటికి తగిన ఆధారాలు చూపాలని, లేకపోతే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు.

2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేదని ఆరోపించిన ఆయన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేసి వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిందన్నారు.

ఉద్యోగాలు వచ్చిన ఏడాది తర్వాత ఎలాంటి ఆధారాలు లేకుండా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా దుష్ప్రచారం చేస్తూ ర్యాలీలు నిర్వహించడం బాధాకరమన్నారు. నిరుద్యోగ యువత వైసీపీ పార్టీతో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కూటమి ప్రభుత్వం ఇప్పటికే 16 వేలకుపైగా టీచర్ ఉద్యోగాలు, 6,100 కానిస్టేబుల్ పోస్టులు, 980 గ్రూప్-2 ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు మరో 10 వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు. ఈ విజయాన్ని జీర్ణించుకోలేక వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తూ విషప్రచారం సాగిస్తోందని విమర్శించారు.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విసిరిన బహిరంగ చర్చ సవాల్‌కు సమాధానం చెప్పకుండా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బెంగళూరుకు వెళ్లిపోయారని, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగులను రెచ్చగొడుతూ ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను అవమానించేలా ఫేక్ ప్రచారం చేయడం సరికాదన్నారు.

ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలల్లో వైసీపీ పేటీఎం బ్యాచ్ ద్వారా భయాందోళనలు సృష్టించి విద్యార్థులను బలవంతంగా ర్యాలీలకు తరలించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఒక్క మెగా డీఎస్సీ కూడా నిర్వహించలేదని, జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు.

ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో పూర్తిగా విఫలమైన వైసీపీ ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ దేశ, విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తున్నారని, గత ఐదేళ్లలో దెబ్బతిన్న రాష్ట్ర ప్రతిష్ఠను కూటమి ప్రభుత్వం పునరుద్ధరిస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మిశెట్టి చంద్రశేఖర్, టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు సుమన్, దినేష్, కళ్యాణ్, గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.