విజయవాడ, జూలై 29 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌గా నల్లమిల్లి మనోజ్ రెడ్డి నియమితులైన సందర్భంగా విజయవాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనను టీడీపీ ఇంచార్జ్‌గా నియమించినందుకు మంత్రికి మనోజ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నిమ్మల రామానాయుడు నల్లమిల్లి మనోజ్ రెడ్డిని సత్కరించి, అభినందనలు తెలిపారు.



