ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్):
ఖమ్మం నగరంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 44 మంది వాహనదారులపై స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి నాగలక్ష్మి శిక్షలు విధించారు. ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం ఒకరికి 7 రోజుల జైలు శిక్ష, మరో 43 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.4.30 లక్షల జరిమానా విధించారు. అలాగే నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపిన ఒకరికి, మైనర్లు వాహనాలు నడిపిన మూడు కేసుల్లో కూడా జరిమానాలు విధించినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని హెచ్చరించారు.



