Sunday, 26 July 2026
  • Home  
  • తొలి ఏకాదశి వేళ కోదండరామాలయంలో ఆధ్యాత్మిక సందడి
- నిజామాబాద్

తొలి ఏకాదశి వేళ కోదండరామాలయంలో ఆధ్యాత్మిక సందడి

వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడా కోదండ రామాలయంలో ఆలయ కమిటీ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పురోహితులు శివకుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు…. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ విట్టల్ బాల్ రెడ్డి వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు… ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని పురోహితులు శివకుమార్ శర్మ ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు తెలిపారు… ఈ పూజా కార్యక్రమానికి గ్రామస్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వారి మొక్కలు తీర్చుకోవడం జరిగిందని అన్నారు… సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండాలని ప్రజలు ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.. పురోహితులు శివకుమార్ శర్మ మాట్లాడుతూ తొలి ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటని దీనికే **శయన ఏకాదశి* లేదా *హరి శయని ఏకాదశి* అని కూడా అంటారని అన్నారు. పురాణాల ప్రకారం, ఈ రోజే శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై *యోగనిద్రలోకి* వెళ్తాడని ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నాలుగు నెలల పాటు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడని ఈ నాలుగు నెలల కాలాన్ని *’చాతుర్మాస్యం’* అంటారని తెలిపారు…తొలి ఏకాదశి నాటికి వర్షాలు ప్రారంభమై పొలం పనులు మొదలవుతాయి. అందుకే దీనిని కొత్త పంటలు, వ్యవసాయ సమృద్ధి కోసం విష్ణుమూర్తిని పూజించే పర్వదినంగా భావిస్తారని,ఈ రోజున భక్తులు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి జాగరణ చేసి, శ్రీమహావిష్ణువును స్మరిస్తారని ఆధ్యాత్మికంగా మనస్సును, శరీర శుద్ధిని పొందడానికి ఈ వ్రతం ఎంతో సహాయపడుతుందని అన్నారు… ఈ కార్యక్రమంలో రాలమాలయ కమిటీ అధ్యక్షులు విటల్ బాల్రెడ్డి, సభ్యులు చంద్రకాంత్,గంగారెడ్డి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.