సీతారామాపురం జులై 25 ( పున్నమి ప్రతినిధి )
సీతారామపురం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (పి టి ఎమ్ 4.0) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు మరియు పాఠశాల మౌలిక సదుపాయాలపై తల్లిదండ్రులతో ఆయన చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను,వివరిస్తూ, ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.


