డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో పెరటి తోటల పెంపకంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళ మండలి చీఫ్ ఫంక్షనరీ వాసంశెట్టి నందివర్ధన మాట్లాడుతూ ఇంటి ఆవరణలో గల ఖాళీ స్థలాల్లో ఆకుకూరలు, కూరగాయలు పండించుకోవడం వల్ల తాజాగా తినడమే కాకుండా మిగిలిన ఆకుకూరలు కూరగాయలను అమ్మటం ద్వారా అధికాదాయం పొందవచ్చునని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త ప్రమీల మాట్లాడుతూ పెరటి తోటల పెంపకం వలన పచ్చదనం పరిశుభ్రత పాటించడంతోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త నూకలక్ష్మీ మాట్లాడుతూ అతి తక్కువ స్థలంలో,తక్కువ కాలంలో పండించుకునే ఆకుకూరలు కూరగాయలను గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు పరిధిలోని మహిళలు పాల్గొన్నారు.

బ్రహ్మపురి గ్రామంలో పెరటి తోటల పెంపకంపై శిక్షణ కార్యక్రమం