డెంగీ నివారణకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: విద్యార్థులకు అవగాహన
ఉదయగిరి: జాతీయ డెంగీ నివారణ మహోత్సవం సందర్భంగా ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం డెంగీ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి షేక్ గాజుల నౌషాద్ బాబు, మండల వైద్యాధికారిణి డాక్టర్ శివకల్పనా రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు “పరిశీలించండి – క్లీన్ చేయండి – మూతలు పెట్టండి” అనే నినాదాలతో అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, దోమతెరలు వినియోగించాలని సూచించారు. డెంగీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, పరిసరాల పరిశుభ్రతతోనే డెంగీని నివారించవచ్చని వివరించారు

డెంగీ నివారణకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: విద్యార్థులకు అవగాహన
డెంగీ నివారణకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: విద్యార్థులకు అవగాహన ఉదయగిరి: జాతీయ డెంగీ నివారణ మహోత్సవం సందర్భంగా ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం డెంగీ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి షేక్ గాజుల నౌషాద్ బాబు, మండల వైద్యాధికారిణి డాక్టర్ శివకల్పనా రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు “పరిశీలించండి – క్లీన్ చేయండి – మూతలు పెట్టండి” అనే నినాదాలతో అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, దోమతెరలు వినియోగించాలని సూచించారు. డెంగీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, పరిసరాల పరిశుభ్రతతోనే డెంగీని నివారించవచ్చని వివరించారు

