రాజన్న సిరిసిల్ల జులై 22 పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల: ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడి చేపట్టిన సీజేపీ (CJP) కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ నాయకులు బిజెపి ప్రభుత్వాన్ని తప్పు పట్టారు అయినప్పటికీ కార్యకర్తలు తమ నిరసనను కొనసాగించారని పేర్కొన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నివాసం వద్ద శాంతియుత నిరసన వ్యక్తం చేయగా, అక్కడ జరిగిన తోపులాటలో ఢిల్లీ పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించడం వల్ల రాహుల్ గాంధీ ముక్కులోంచి రక్తం కారణం కాంగ్రెస్ నాయకులను దిగ్భ్రాంతులకు గురిచేసింది
ఈ ఘటనను ఖండిస్తూ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం సరికాదని, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలను వెంటనే విరమించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, ఎంపీటీసీ మిర్యాలంకర్ శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి బాల్‌రెడ్డి, కొనరావుపేట ఎంపీటీసీ చైర్మన్ నరసయ్య, మేకల కమలాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, మల్లేశంతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



