Wednesday, 22 July 2026
  • Home  
  • *సంకల్ప బలం*(కవిత) – డా. బద్రి పీర్ కుమార్
- సాహితీ

*సంకల్ప బలం*(కవిత) – డా. బద్రి పీర్ కుమార్

ఓర్పు నేర్పు నేత్రాలుగ సత్సంకల్పం మూలసూత్రంగ ఎదురయ్యే ఆటంకాలకు ఆగక గమ్యం వైపు అడుగులు వేస్తే విజయ ఢంకా మ్రోగుతుంది ఫలితంనెంచక విఫలం చెందక శ్రమారాధనగా యత్నించగ ప్రయత్నమే విజయకాంక్షగ పట్టుదలే మార్గమైతే పర్వతమే చలిస్తుంది పయనం విజయసోపానం అవుతుంది ఆలోచనకు విశ్వాసం తోడైతే ఎదురయ్యే అవరోధాలను ఆధారాలుగ మానససంద్ర కేంద్ర శిఖరంగ ఆత్మవిశ్వాసమే విజయ తీరమవుతుంది అభీష్టసిద్ధికి ఫలప్రదం అవుతుంది శుభసంకల్పించే మానవుని జీవితం అనునిత్యం సమన్వితం ఆజన్మాంతం ఇది సంకల్పబల సంకేతం తపించే హృదయాల సొంతం నిత్యజీవన నవోదయ ఆనందభరితం

ఓర్పు నేర్పు నేత్రాలుగ
సత్సంకల్పం మూలసూత్రంగ
ఎదురయ్యే ఆటంకాలకు ఆగక
గమ్యం వైపు అడుగులు వేస్తే
విజయ ఢంకా మ్రోగుతుంది

ఫలితంనెంచక విఫలం చెందక
శ్రమారాధనగా యత్నించగ
ప్రయత్నమే విజయకాంక్షగ
పట్టుదలే మార్గమైతే పర్వతమే చలిస్తుంది
పయనం విజయసోపానం అవుతుంది

ఆలోచనకు విశ్వాసం తోడైతే
ఎదురయ్యే అవరోధాలను ఆధారాలుగ
మానససంద్ర కేంద్ర శిఖరంగ
ఆత్మవిశ్వాసమే విజయ తీరమవుతుంది
అభీష్టసిద్ధికి ఫలప్రదం అవుతుంది

శుభసంకల్పించే మానవుని జీవితం
అనునిత్యం సమన్వితం ఆజన్మాంతం
ఇది సంకల్పబల సంకేతం
తపించే హృదయాల సొంతం
నిత్యజీవన నవోదయ ఆనందభరితం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.