ఖమ్మం, జులై
(పున్నమి ప్రతినిధి):
ఖమ్మం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ & డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 46 మంది వాహనదారులను పోలీసులు పట్టుకున్నారు.
వారందరినీ స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి బి. నాగలక్ష్మి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.4.60 లక్షల జరిమానా విధించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బెల్లం సత్యనారాయణ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రంక్ & డ్రైవ్ కేసుల ప్రాసిక్యూషన్‌లో సమర్థంగా సహకరించిన పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.



