*వై.ఎస్. జగన్ ‘సీమ’ క్యాన్సర్ గడ్డ కాదు, జగన్ దే ఎప్పటికీ రాయలసీమ అడ్డా.*
*పోతారెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని వై.ఎస్ పెంచకపోతే ‘సీమ’ ప్రాజెక్ట్ ల గతి ఏమిటి?*
*నాడు వై.ఎస్. ఉద్యమించడంతోనే ఎన్టీఆర్ ‘సీమ’ ప్రాజెక్టులకు రూపకల్పన.*
*వై.ఎస్… వై.ఎస్.జగన్ లను లోకేష్ విమర్శించడం అవగాహనా రాహిత్యమే.*
*మంత్రి నారా లోకేష్ పై వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం పైర్.*
*వై.ఎస్.జగన్ రాయలసీమకు పుట్టిన క్యాన్సర్ గడ్డ లాంటి వాడని వైయస్సార్ కడప జిల్లా పర్యటనలో టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్,ఐ.టి,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసందర్భ ప్రేలాపనలు చేయడం సిగ్గు చేటని, రాయలసీమ అభివృద్దిని కాంక్షించి,ప్రాజెక్టులను పరుగులు పెట్టించిన అపర భగరదుడు వైయస్ జగన్ దే ఎప్పటికీ రాయలసీమ అడ్డా అని ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్ర లో జగన్ బాహుబలి అయినందునే చంద్రబాబు, లోకేష్ లు జగన్ పేరు ఎత్తకుండా మాట్లాడే పరిస్థితి లేదని దీనిని బట్టి జగన్ అంటే వారికి ఎంత భయమో స్పష్టమౌవుతుందని వైఎస్ఆర్సిపీ రాష్ట్ర కార్యదర్శి, కనులాపురం నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి విస్పష్టంగా ప్రకటించారు. కడప నగరంలో వైఎస్ఆర్సిపీ జిల్లా కార్యాల యంలో గురువారం ఉదయం రెడ్యం విలేకరులతో మాట్లాడుతూ డా|| వై.ఎస్.రాజ శేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచాలనుకున్నప్పడు తెలంగాణా కాంగ్రెస్ అగ్ర నేతలు పి.జనార్ధనారెడ్డి,మర్రి శశిధర్ రెడ్డి లాంటి నేతలు సొంతపార్టీలో ఉద్యమిస్తే వాటిని లెక్క చేయకుండా పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుండి 44 వేలక్యూసెక్కులకు పెంచిన దీశాలి డా|| వై.ఎస్ అని ఆయని కొనియాడారు.కానీ… దానిని వ్యతిరేకిస్తూ, నిరసిస్తూ కోస్తాలో ప్రకాశం బ్యారేజీపై టీడిపి నేత దేవినేని ఉమా,తెలంగాణ లోని మహబూబ్ నగర్ జిల్లా లో డా||నాగం జనార్ధన్ రెడ్డి లతో ధర్నాలు చేయించి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ గొట్టించింది మీ తండ్రి నారా చంద్రబాబు నాయుడు అన్నది జగద్విదితమన్నారు.నాడు డా||వై.ఎస్ పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచకపోతే రాయలసీమ ప్రాజెక్ట్ ల పరిస్థితి ఏమని ఆయన నిలదీశారు. 1983-1984వ సంవత్సరంలో నాటి పిసిసి చీప్ డా|| వై.ఎస్. రాజ శేఖర్ రెడ్డి నాయకత్యం లో పోతిరెడ్డిపాడు కరువుబండ యాత్ర పెద్ద ఎత్తున చేపట్టడంతోనే రాయలసీమ కరువు పరిస్థితులు తెలుసుకుని, పరిస్థితులను గమనించి బేషజాలకు,అహంకారానికి పోకుండా నాటి ముఖ్యమంత్రి డా|| నందమూరి తారక రామారావు రాయలసీమ ప్రాజెక్టులను ప్రకటించారని ఆయన స్పష్టం చేశారు.డా||వై.ఎస్,వై.ఎస్. జగన్ లు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు రాయలసీమ ప్రాజెక్టులకు అత్యధిక నిధులు కేటాయించి ప్రాజెక్ట్ పనులను పరుగులు పెట్టించి ఉండక పోతే రాయలసీమ కు నీరు వచ్చేవా?అని ఆయన సూటిగా ప్రశ్నించారు. తండ్రి, కొడుకులు,వై.ఎస్, వై.ఎస్ జగన్ లు ముఖ్యమంత్రులు గా ఉండి రాయలసీమకు నీళ్ళు తెచ్చుకోలేకపోయారనటం మొగుణ్ణి కొట్టి మొగ సాల ఎక్కినట్లు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. తెలుగుగంగ, గాలేరు – నగరి, ఎస్సార్ బి.సి ఆయకట్టు రైతుల ప్రయోజ నాలను పరిరక్షించడంతోపాటు, రాయలసీమ, నెల్లూరు జిల్లాల దాహార్తిని తీర్చడం కోసం శ్రీ శైలంలో 800 అడుగుల నుంచి రోజుకు 3 టి.యం సి ల నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా దిగువన కాలువలోకి ఎత్తి పోసేలా వై.ఎస్.జగన్ రాయల సీమ ఎత్తి పోతల చేపట్టటం’ సీమ ‘ పట్ల ఆయన కున్న చిత్త శుద్ధి కి నిదర్శనమని ఆయన కొనియాడారు.కానీ… వై.ఎస్. జగన్ చేపట్టిన ఎత్తిపోతలను కూటమి నేతలు వ్యతిరేకించడం సిగ్గుచేటుని, ‘సీమ’ను గురించి మాట్లాడే నైతిక హక్కు లోకేష్ లేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తో కుదిరిన చీకటి ఒప్పందoతోనే ‘సీమ’ ఎత్తి పోతలను ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆపివేశారని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం తో వారి ‘ సీమ’ వ్యతిరేకత బహిర్గత మైందని ఆయన ద్వజమెత్తారు.కర్నాటకలో ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచినా, అప్పర్ భద్ర అనుమతులను చంద్రబాబు అడ్డుకోకపోవడంతో తుంగభద్ర డ్యాంపై ఆధార పడ్డ హెచ్చెల్సీ,ఎల్లెల్సీ, కె.సి. కాలువ ల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకమైంది వాస్తవం కాదా? అని ఆయన నిలదీశారు.వాస్తవాలను వక్రీకరిస్తూ,వై.ఎస్, వై.ఎస్. జగన్ ల పై విషం చిమ్మడం చంద్రబాబు,లోకేష్ కు పరిపాటిగా మారిందని ఆయన నిశితంగా విమర్శించారు.’సీమ’ రైతాంగాన్ని సర్వనాశనం చేసి, నీతులు చెప్పడం వై.ఎస్, వై.ఎస్ జగన్ పై విషం చిమ్మడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.చంద్రబాబు, లోకేష్ లకు ‘సీమ’ రైతాంగం,ప్రజలు తగిన సమయం లో బుద్ధి చెప్పడం ఖాయమని రెడ్యం తీవ్రంగా హెచ్చరించారు.*


