Thursday, 16 July 2026
  • Home  
  • అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాం: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
- News - ఆంధ్రప్రదేశ్ - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాం: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

24 మంది అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు నియామక ఉత్తర్వులు అందజేత ఆత్మకూరు, జూలై 16 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం మాతా-శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.గురువారం ఆత్మకూరు పట్టణంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నిర్వహించిన కార్యక్రమంలో ఐసీడీఎస్ (ICDS) పరిధిలో నూతనంగా ఎంపికైన 24 మంది అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు మంత్రి నియామక ఉత్తర్వులను అందజేశారు. అనంతరం వారిని అభినందించి, ప్రజాసేవలో అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక సంస్కరణలను అమలు చేస్తోందన్నారు. చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలను ఆధునికీకరిస్తూ, అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యా సామగ్రి, పోషకాహార సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోందని తెలిపారు.చిన్న వయస్సు నుంచే పిల్లల్లో అభ్యాస సామర్థ్యాలు, మేధో వికాసం, సామాజిక నైపుణ్యాలు పెంపొందించడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. నూతనంగా నియామకాలు పొందిన అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, ప్రాథమిక విద్య, సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరవేసే బాధ్యత కూడా అంగన్వాడీ సిబ్బందిపై ఉందని పేర్కొన్న మంత్రి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా సేవలందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఐసీడీఎస్ సిబ్బంది, నూతనంగా నియామకాలు పొందిన అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.

24 మంది అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు నియామక ఉత్తర్వులు అందజేత

ఆత్మకూరు, జూలై 16 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):

రాష్ట్ర ప్రభుత్వం మాతా-శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.గురువారం ఆత్మకూరు పట్టణంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నిర్వహించిన కార్యక్రమంలో ఐసీడీఎస్ (ICDS) పరిధిలో నూతనంగా ఎంపికైన 24 మంది అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు మంత్రి నియామక ఉత్తర్వులను అందజేశారు. అనంతరం వారిని అభినందించి, ప్రజాసేవలో అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక సంస్కరణలను అమలు చేస్తోందన్నారు. చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలను ఆధునికీకరిస్తూ, అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యా సామగ్రి, పోషకాహార సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోందని తెలిపారు.చిన్న వయస్సు నుంచే పిల్లల్లో అభ్యాస సామర్థ్యాలు, మేధో వికాసం, సామాజిక నైపుణ్యాలు పెంపొందించడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. నూతనంగా నియామకాలు పొందిన అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, ప్రాథమిక విద్య, సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరవేసే బాధ్యత కూడా అంగన్వాడీ సిబ్బందిపై ఉందని పేర్కొన్న మంత్రి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా సేవలందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఐసీడీఎస్ సిబ్బంది, నూతనంగా నియామకాలు పొందిన అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.