ప్రాథమిక విద్య ప్రతి విద్యార్థి జీవితానికి బలమైన పునాది. ప్రాథమిక విద్య బలంగా ఉంటేనే ఉన్నత విద్యలో విజయాలు సాధించడం సులభమవుతుంది. కాబట్టి ప్రతి చిన్నారికి నాణ్యమైన(quality of primary education) ప్రాథమిక విద్య అందించడం పాఠశాల, ప్రభుత్వం మరియు సమాజం యొక్క ఉమ్మడి బాధ్యత.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ విద్య సంవత్సరం ప్రారంభానికి ముందు వేసవి సెలవుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో ఉపాధ్యాయులందరూ పాల్గొని దాదాపుగా వేసవి సెలవుల్లోనే అడ్మిషన్లు పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడుల్లో చేపడుతున్నటువంటి విద్యాసంష్కరణలను వివరిస్తూ ఉపాధ్యాయులుగా వారికి భరోసానిస్తూ క్షేత్రస్థాయిలో అడ్మిషన్స్ చేసుకోవడం జరిగింది ఈ క్రమంలో ఉదాహరణకు నెల్లూరు రూరల్ పరిధిలోని MCPS ఫతే ఖాన్ పేట పాఠశాలలో 107 మంది విద్యార్థులకు కేవలం ఒకే ఒక టీచర్ ద్వారా పాఠశాల నడపబడుతుంది మరియు MCPS కొండాయపాలెం డొంక పాఠశాల నందు 50 మంది విద్యార్థులకు ఒక టీచర్ ద్వారా,MCPS వెంగళరావు నగర్ పాఠశాలలో 281 మంది విద్యార్థులకు 10 మంది ఉపాధ్యాయులు అవసరం ఉన్న చోట కేవలం 4గురి ఉపాధ్యాయులచేత పాఠశాల నడపబడుతుంది అదేవిధంగా నెల్లూరు అర్బన్ మండలానికి సంబంధించి MCPS దీన్ దయాల్ నగర్ పాఠశాల నందు 107 మంది విద్యార్థులకు కేవలం ఒకే ఒక్క టీచరు మరియు MCPS సంతపేట పాఠశాల నందు 82 మంది విద్యార్థులకు కేవలం ఒకే ఒక టీచర్ చేత పాఠశాల నడపబడుతుంది మరియు నెల్లూరు అర్బన్ పరిధిలోనే అత్యధికంగా విద్యార్థులు ఉన్న ప్రభుత్వ పాఠశాల MCPS కృష్ణ మందిరం నందు 12 మంది ఉపాధ్యాయుల అవసరం ఉంటే కేవలం 8 మంది ఉపాధ్యాయుల చేత పాఠశాల నడపబడుతుంది. ఈ విధంగా నెల్లూరు అర్బన్ మరియు రూరల్ మండలంలోని కేవలం మున్సిపల్ ప్రాథమిక పాఠశాలల్లో 93 మంది ఉపాధ్యాయుల అవసరం ఉంది. అదేవిధంగా ఉన్నత పాఠశాలలో వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా కొన్ని సబ్జెక్టులలో ఉపాధ్యాయులు వచ్చినప్పటికీ ఇంకా సబ్జెక్టు టీచర్ల కొరత వెంటాడుతూనే ఉంది ముఖ్యంగా బయాలజీ,ఫిజిక్స్,హిందీ సబ్జెక్టు కొరత తీవ్రంగా ఉంది
ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయుల కొరత ఇంత తీవ్రంగా ఉంటే విద్యాబోధనలో అది ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో విద్యార్థుల విద్యా సామర్ధ్యాలు ఎలా దెబ్బతింటాయో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ఎంత కష్టమో మనందరి కంటే మీకు విధితమే ఆదివారం నాటికి నెల్లూరు జిల్లాలో విద్యా శాఖలో వర్క అడ్జస్ట్మెంట్ పూర్తి అయినప్పటికీ ముఖ్యంగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలకు ఒక్క ఉపాధ్యాయుడు కూడా సర్దుబాటు కాలేదు ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెల్లూరు కార్పొరేషన్ లోని ప్రాథమిక పాఠశాలల్లో నెల్లూరు అర్బన్ మండలం పరిధిలో 64 మంది ఉపాధ్యాయులు,నెల్లూరు రూరల్ మండలం పరిధిలో 29 మంది ఉపాధ్యాయుల కొరత ఉంది కావున పై అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయుల కొరత తీర్చే విధంగా పూర్తిస్థాయిలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను వీలైనంత త్వరగా నియమించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఈరోజు నెల్లూరు జిల్లా గౌరవ విద్యాశాఖ అధికారీ గారికి రిపబ్లిక్ టీచర్స్ అసోసియేషన్ పక్షాన కలిసి కోరడo జరిగింది


