డీడీఓగా పదోన్నతి పొందిన శ్రీ చిలకల శ్రీహరికి ఘన సన్మానం – ఐటీడీపీ సీనియర్ నాయకుడు నాటకరాణి వెంకట్ శుభాకాంక్షలు
:
నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)గా సమర్థవంతంగా విధులు నిర్వహించి, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ (డీడీఓ)గా నెల్లూరు డ్వామా కార్యాలయానికి పదోన్నతి పొందిన శ్రీ చిలకల శ్రీహరి గారిని కోవూరు నియోజకవర్గ ఐటీడీపీ సీనియర్ నాయకులు శ్రీ నాటకరాణి వెంకట్ ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ప్రజల సంక్షేమం కోసం శ్రీహరి గారు అందించిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.
ఈ సందర్భంగా నాటకరాణి వెంకట్ మాట్లాడుతూ, శ్రీ చిలకల శ్రీహరి గారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహిస్తూ ప్రజాసేవలో విశేష విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వారి అనుభవం, అంకితభావం ప్రభుత్వానికి, ప్రజలకు మరింత ఉపయోగపడాలని శుభాకాంక్షలు తెలిపారు.


