Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సాహితీ

నూతన సంవత్సర స్వాగతాక్షర సుమాంజలి(2026) – డాక్టర్ బద్రి పీర్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నూతన సంవత్సర స్వాగతాక్షర సుమాంజలి(2026) – డాక్టర్ బద్రి పీర్ కుమార్

వార్త ముఖ్యాంశాలు

  • వి *నూ* తన ప్రపంచంలో విహరించగ, విధి రా *త* లు జీవన పుష్ప రేఖలై పరిమళించగ జ *న* సమోహం సత్ప్రవర్తన గీతం ఆలపించగ ఆ *సం* గీత సరాగసుమాలు దీర్ఘాయుషు నివ్వగ న *వ* వసంతనాదం సంతసమున చేయూత నందించగ వా *త్స* ల్య…
  • పలుకుతున్నాము నూతన సంవత్సరానికి స్వాగతం అందుకుందాము మధుర స్మృతుల సమ్మేళన ఫలితం.

వి *నూ* తన ప్రపంచంలో విహరించగ, విధి
రా *త* లు జీవన పుష్ప రేఖలై పరిమళించగ
జ *న* సమోహం సత్ప్రవర్తన గీతం ఆలపించగ
ఆ *సం* గీత సరాగసుమాలు దీర్ఘాయుషు నివ్వగ
న *వ* వసంతనాదం సంతసమున చేయూత నందించగ
వా *త్స* ల్య వాయువు సులక్షణ సుమాలు వెదజల్లగ
ప్రా *రం* భం కానున్న ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకగ
విజయ సంకల్ప సోపాన తోరణాల ఆహ్వానం
సరికొత్త ఆశల ఆత్మీయ సంపదల జీవన గమనం
నిరంతరం సాగాలని కాంక్షిస్తూ…
పలుకుతున్నాము నూతన సంవత్సరానికి స్వాగతం
అందుకుందాము మధుర స్మృతుల సమ్మేళన ఫలితం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *