Wednesday, 30 September 2026
  • Home  
  • గుర్రం జాషువా ఒక సామాజిక జోష్ -డా. బద్రి పీర్ కుమార్
- సాహితీ

గుర్రం జాషువా ఒక సామాజిక జోష్ -డా. బద్రి పీర్ కుమార్

తెలుగు సాహిత్య చరిత్రలో అంటరానితనం, సామాజిక అసమానతలపై తన కలం ద్వారా పోరాడిన గొప్ప అభ్యుదయ కవి స్వర్గీయ గుర్రం జాషువా. సమాజంలోని రుగ్మతలను ఎండగట్టిన విశ్వకవి, కవికోకిలగా పిలవబడే జాషువా గారు 1895 సెప్టెంబరు 28న ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో గుర్రం వీరయ్య, లింగమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచే ఆర్థిక ఇబ్బందులు, కుల వివక్షను ఎదుర్కొంటూనే పట్టుదలతో సాహిత్యాన్ని అభ్యసించారు. అంతవరకు రాజుల వైభోగాల చుట్టూ, దేవుళ్ల చుట్టూ తిరిగిన కవిత్వాన్ని సామాన్య మానవుడి వైపు, సమాజంలో అణచివేతకు గురైన దళితుల వైపు మళ్లించారు. ఆయన రాసిన ‘గబ్బిలం’ మహాకావ్యం తెలుగు సాహిత్యంలో మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు. ఫిరదౌసి, నాగరాజు, కథాక్షేత్రి, ముసాఫిరులు వంటి అద్భుతమైన రచనలు చేశారు.1964లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. భారత ప్రభుత్వం 1970 సంవత్సరంలో ఈ నవయుగ కవిచక్రవర్తిని పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. జాషువా కేవలం ఒక కులానికో, మతానికో పరిమితం కాలేదు. ‘విశ్వనరుడను నేను’ అని ప్రకటించుకుంటూ ప్రపంచ మానవులందరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కవిత్వం రాశారు. సెప్టెంబర్ 28న జాషువా జన్మదినం సందర్భంగా పున్నమి పాఠకుల కోసం ఈ కవిత 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 సమాజాన్ని మేల్కొలిపే కవితాక్షరాల అస్త్రబలం తను రాసిన గబ్బిలం ఒక సామాజిక నిరసన గ్రంథఫలం కులాలుమతాల కన్నా మానవత్వమే గొప్పదనే తన భావజాలం అంటరానితనం నిర్మూలనే తన ఆశయం సామాజిక ప్రయోజనం సంఘ సంస్కరణే ధ్యేయం మనుషులంతా ఒక్కటేననే సమసమాజ భావ సమన్వయం సాహిత్యంలో గొప్ప సామాజిక విప్లవకారుడు మహాకవిగ అసమానతల నిర్మూలనాచార్యుడు కలంతో తన గళంతో కులవివక్షను విచ్ఛిన్నం చేసినవాడు కేవలం చట్టాల ద్వారా రాదు సామాజిక మార్పు అది మానవ హృదయాలలో సంభవించగ జరుగు కూర్పు కవికోకిలగ కళాప్రపూర్ణగ పద్మభూషణ్గా తన సామాజిక చైతన్య చేర్పు ఆలోచింపజేసే కవిత్వం ఆశావహ దృక్పథ తత్వం విశ్వమానవ సమానత్వం జాషువా సామాజిక జోష్కు అమరత్వం 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

తెలుగు సాహిత్య చరిత్రలో అంటరానితనం, సామాజిక అసమానతలపై తన కలం ద్వారా పోరాడిన గొప్ప అభ్యుదయ కవి స్వర్గీయ గుర్రం జాషువా. సమాజంలోని రుగ్మతలను ఎండగట్టిన విశ్వకవి, కవికోకిలగా పిలవబడే జాషువా గారు 1895 సెప్టెంబరు 28న ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో గుర్రం వీరయ్య, లింగమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచే ఆర్థిక ఇబ్బందులు, కుల వివక్షను ఎదుర్కొంటూనే పట్టుదలతో సాహిత్యాన్ని అభ్యసించారు. అంతవరకు రాజుల వైభోగాల చుట్టూ, దేవుళ్ల చుట్టూ తిరిగిన కవిత్వాన్ని సామాన్య మానవుడి వైపు, సమాజంలో అణచివేతకు గురైన దళితుల వైపు మళ్లించారు. ఆయన రాసిన ‘గబ్బిలం’ మహాకావ్యం తెలుగు సాహిత్యంలో మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు. ఫిరదౌసి, నాగరాజు, కథాక్షేత్రి, ముసాఫిరులు వంటి అద్భుతమైన రచనలు చేశారు.1964లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. భారత ప్రభుత్వం 1970 సంవత్సరంలో ఈ నవయుగ కవిచక్రవర్తిని పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. జాషువా కేవలం ఒక కులానికో, మతానికో పరిమితం కాలేదు. ‘విశ్వనరుడను నేను’ అని ప్రకటించుకుంటూ ప్రపంచ మానవులందరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కవిత్వం రాశారు. సెప్టెంబర్ 28న జాషువా జన్మదినం సందర్భంగా పున్నమి పాఠకుల కోసం ఈ కవిత
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
సమాజాన్ని మేల్కొలిపే కవితాక్షరాల అస్త్రబలం
తను రాసిన గబ్బిలం ఒక సామాజిక నిరసన గ్రంథఫలం
కులాలుమతాల కన్నా మానవత్వమే గొప్పదనే తన భావజాలం

అంటరానితనం నిర్మూలనే తన ఆశయం
సామాజిక ప్రయోజనం సంఘ సంస్కరణే ధ్యేయం
మనుషులంతా ఒక్కటేననే సమసమాజ భావ సమన్వయం

సాహిత్యంలో గొప్ప సామాజిక విప్లవకారుడు
మహాకవిగ అసమానతల నిర్మూలనాచార్యుడు
కలంతో తన గళంతో కులవివక్షను విచ్ఛిన్నం చేసినవాడు

కేవలం చట్టాల ద్వారా రాదు సామాజిక మార్పు
అది మానవ హృదయాలలో సంభవించగ జరుగు కూర్పు
కవికోకిలగ కళాప్రపూర్ణగ పద్మభూషణ్గా తన సామాజిక చైతన్య చేర్పు

ఆలోచింపజేసే కవిత్వం
ఆశావహ దృక్పథ తత్వం
విశ్వమానవ సమానత్వం
జాషువా సామాజిక జోష్కు అమరత్వం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.