ఖానాపురం పున్నమి ప్రతినిధి: భూక్య రవి మరణించాడని
విషయం తెలుసుకున్న సర్పంచ్ దాసరి రమేష్ పార్టీ నాయకులతో కలిసి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం భూక్య రవి గారి మృతదేహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ దాసరి రమేష్ మాట్లాడుతూ, భూక్య రవి మృతి చెందడం చాలా బాధాకరమని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, కుటుంబానికి సర్పంచ్ దాసరి రమేష్ ఉప సర్పంచ్ ఉప్పు రాజు కొంత ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే గ్రామపంచాయతీ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు మచ్చిక అశోక్ వార్డు సభ్యులు అజహర్, ఇలపొంగు కొమురమ్మ, భూక్య స్రవంతి నవీన్ పార్టీ నాయకులు బోడ పూలు నాయక్, నూనెల కుమారస్వామి, కామిశెట్టి సుధీర్, బోడ దేవా, తోటకూర కుమార స్వామి, యాకూబ్ పాషా, తోటకూర సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.



