భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన మరియు ధైర్యసాహసాలు కలిగిన యువ విప్లవకారుడు భగత్ సింగ్. దేశ విముక్తి కోసం తన చిన్న వయసులోనే ప్రాణాలర్పించి, నేటికీ కోట్లాది మంది యువతకు స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్నారు. భగత్ సింగ్ 1907 సెప్టెంబరు 28న లాయల్పూర్ జిల్లాలోని బంగా గ్రామంలో(అప్పటి పంజాబ్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది) దేశభక్తి కలిగిన విప్లవకారుల కుటుంబంలో విద్యావతి కిషన్ సింగ్ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుండే దేశభక్తి అలవర్చు కోవడంవలన 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఉదంతం భగత్ సింగ్ మనస్సుపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ రక్తం నానిన నేల నుంచి (జలియన్ వాలాబాగ్) మట్టిని తెచ్చుకుని బ్రిటీష్ పాలనను అంతమొందించాలని భగత్ సింగ్ ప్రతిజ్ఞ చేశారు. లాహోర్ కుట్ర కేసులో భాగంగా బ్రిటీష్ ప్రభుత్వం భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు ఉరిశిక్ష విధించింది. 1931 మార్చి 23న కేవలం 23 సంవత్సరాల వయసులోనే చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడి అమరులయ్యారు భగత్ సింగ్. సెప్టెంబర్ 28న జన్మదినం సందర్భంగా భగత్ సింగ్ ను గుర్తు చేసుకుంటూ ఈ కవిత.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*అ* అమరవీరుడు దేశ యువతకు స్ఫూర్తి ధీరుడు
*మ* మార్గం విప్లవంగా సాగిన సమరయోధుడు
*ర* రచనలోనూ విప్లవజ్యోతుల ఆలోచనపరుడు
*వీ* వీరత్వ సేవలో యువత శక్తియుక్తుల మార్గదర్శకుడు
*రు* రుజువు ప్రాణత్యాగమే బ్రిటిష్ సామ్రాజ్యమంతం అన్నవాడు
*డు* డు ఆర్ డై విధానంలో గాంధీజీకి దగ్గర వాడు
*భ* భరతజాతిని దాస్య విముక్తి చేయడంలోనూ
*గ* గగన తలంలో భారత జెండాను రెపరెపలాడించడంలోనూ
*త్* తెగింపు స్ఫూర్తితో నేటికీ విప్లవ లోకంలో సజీవంగా ఉన్నవాడు
*సిం* సింహ రాజసంగా స్ఫురించు భరతమాత ముద్దుబిడ్డ
*గ్* గీతం స్వేచ్ఛ భరితం భరతమాత విప్లవ చరితం వినిపించే దేశభక్తి ఫిరంగి భగత్ సింగ్
*జై హింద్*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹