*ఎల్నినో ప్రభావం – వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచన*
*గార్లఒడ్డు లో అవగాహన కార్యక్రమం*
జులై 16 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు:
గార్లఒడ్డు గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్యా నర్సి లాలు నాయక్ ఆధ్వర్యంలో గ్రామ రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఎల్నినో వల్ల వరి వద్దు ప్రత్యామ్నాయ పంటలు ముద్దు
ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా వర్షపాతం తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు తెలిపారు. దీంతో వరి సాగు చేసే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
కాబట్టి రైతులు వరికి బదులు పెసర, మినుము, కంది, జొన్న, సజ్జలు, ఆముదం వంటి తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు.
*పంట కుంటలపై ప్రత్యేక అవగాహన*
ఈ కార్యక్రమంలో పంట కుంటల ఫార్మ్ పాండ్ ల ప్రాముఖ్యతపై కూడా రైతులకు అవగాహన కల్పించారు.
5 ఎకరాల లోపు భూమి ఉండి, జాబ్ కార్డు ఉన్న ప్రతి రైతు ఈ పంట కుంటలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
₹96,000 నుండి ₹1,20,000 వరకు
ఆధార్ కార్డు జిరాక్స్, పాస్ బుక్ జిరాక్స్, జాబ్ కార్డు జిరాక్స్ మరియు అప్లికేషన్ ఫారం. వీటిని నింపి వ్యవసాయ శాఖ కార్యాలయంలో అందజేయాలని అధికారులు కోరారు.
*పంట కుంటల వల్ల ఉపయోగాలు:*
నీటి నిల్వ కూరగాయల పంటలకు నీటిని నిల్వ చేసి ఉపయోగించుకోవచ్చు
చేపల పెంపకం కుంటల్లో చేప పిల్లలను పెంచుకునే అవకాశం
జీవన ఎరువులు అజోస్పేరిల్లం, అజోలా వంటి జీవన ఎరువులను తయారు చేసుకోవచ్చు
భూగర్భ జలాలు పెరగడానికి పంట కుంటలు ఎంతో అవసరం
కాబట్టి భూగర్భ జలాలను పెంచేందుకు, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రతి రైతు పంట కుంటలను ఏర్పాటు చేసుకోవాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో గ్రామ నాయకులు భూక్యా లాలు వ్యవసాయ విస్తరణ అధికారి సపవత్ సైదులు ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు రైతులు
గుగులోత్ భీమా నాయక్
కోసూరి నరసింహారావు దారావత్ జయరాం నాయక్
శంకర్ హనుమంత్ రావు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.



