Tuesday, 14 July 2026
  • Home  
  • నీటి సమస్య తీర్చకుంటే మున్సిపల్ ఆఫీస్ ముట్టడిస్తాం వైఎస్సార్‌సీపీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నీటి సమస్య తీర్చకుంటే మున్సిపల్ ఆఫీస్ ముట్టడిస్తాం వైఎస్సార్‌సీపీ

ఆత్మకూరు : తీవ్రమైన తాగునీటి సమస్యపై వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో గత రెండు వారాలుగా కొనసాగుతున్న తాగునీటి సంక్షోభం అధికారుల నిర్లక్ష్యం, ముందస్తు ప్రణాళికల లోపానికి నిదర్శనమని, ఉత్తరకాలువ మరమ్మతుల కారణంగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని మూడు నెలల ముందే తెలిసినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం అధికారుల వైఫల్యమేనని వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు. పట్టణ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నాయకులు సోమవారం మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా పార్టీపట్టణ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని 23 వార్డుల ప్రజలు గుక్కెడు తాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారని, నీటి కోసం మహిళలు బిందెలతో గంటల తరబడి ఎదురు చూసే పరిస్థితి నెలకొన్నప్పటికీ అధికారులు మాత్రం స్పందించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ముందస్తు ప్రణాళికతో ప్రత్యామ్నాయ నీటి సరఫరా వ్యవస్థను సిద్ధం చేసి ఉంటే నేడు ప్రజలు ఈ దుస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండేదే కాదన్నారు. అప్పారావుపాళెం నుంచి ఆరు వార్డులకు సరఫరా చేస్తున్న పెన్నానది నీటిని అవసరాన్ని బట్టి మరిన్ని వార్డులకు విస్తరించే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ వనరులను కూడా సక్రమంగా వినియోగించకుండా, పైపులైన్ ద్వారా జరుగుతున్న సరఫరాను కొద్ది రోజుల పాటు నిలిపివేయడంతో సమస్య మరింత తీవ్రమైందన్నారు. ఉత్తరకాలువ మరమ్మతుల కారణంగా ప్రధాన సరఫరా నిలిచిపోయిన సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజలకు కనీస అవసరమైన తాగునీటిని కూడా అందించలేని పరిస్థితి ఏర్పడడం మున్సిపల్ పాలన వైఫల్యానికి నిదర్శనమని నాయకులు మండిపడ్డారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద నిర్మించిన మరుగుదొడ్లను కూడా నీటి కొరత కారణంగా ప్రజలు వినియోగించలేకపోతున్నారని, పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 12 ఏళ్ల మున్సిపల్ చరిత్రలో ప్రజలు ఇంత తీవ్ర తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కోలేదని పేర్కొన్నారు.ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాపైనే ఆధారపడే పరిస్థితి తీసుకొచ్చి అధిక బిల్లులు చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రతి వార్డుకు ప్రతిరోజూ సురక్షితమైన తాగునీరు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను కోరారు. సమస్యను అత్యవసరంగా పరిగణించి యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని, లేకపోతే ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మరో రెండు రోజుల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే మహిళలు, ప్రజలతో కలిసి మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపడతామని వైఎస్సార్సీపీ నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు అండ్రా సుబ్బారెడ్డి, తోడేటి మణి, ఇందూరు సురేంద్రరెడ్డి, నోటి వినయ్‌కుమార్‌రెడ్డి, నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు నందవరం ప్రసాద్, పట్టణ మైనారిటి అధ్యక్షులు మీరామొహిద్దీన్, ముజీబుల్లా, షేక్ రహీం, షేక్ పర్వీన్, పట్టణ యువత అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డి, పట్టణ కార్యవర్గసభ్యులు సుబ్బారెడ్డి, నారాయణరెడ్డి, బ్రహ్మనాయుడు, వెంకటేశ్వర్లు, వెంగళరెడ్డి, జనార్ధన్‌రెడ్డి, జమ్రు, మల్లికార్జున, షారూక్, యర్రగుంట్ల మల్లికార్జున, యడ్ల విష్ణు, బాలచెన్నయ్య, యానాదిరెడ్డి, యస్థాని, చైతన్య, తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు : తీవ్రమైన తాగునీటి సమస్యపై వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో గత రెండు వారాలుగా కొనసాగుతున్న తాగునీటి సంక్షోభం అధికారుల నిర్లక్ష్యం, ముందస్తు ప్రణాళికల లోపానికి నిదర్శనమని, ఉత్తరకాలువ మరమ్మతుల కారణంగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని మూడు నెలల ముందే తెలిసినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం అధికారుల వైఫల్యమేనని వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు. పట్టణ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నాయకులు సోమవారం మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా పార్టీపట్టణ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని 23 వార్డుల ప్రజలు గుక్కెడు తాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారని, నీటి కోసం మహిళలు బిందెలతో గంటల తరబడి ఎదురు చూసే పరిస్థితి నెలకొన్నప్పటికీ అధికారులు మాత్రం స్పందించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ముందస్తు ప్రణాళికతో ప్రత్యామ్నాయ నీటి సరఫరా వ్యవస్థను సిద్ధం చేసి ఉంటే నేడు ప్రజలు ఈ దుస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండేదే కాదన్నారు. అప్పారావుపాళెం నుంచి ఆరు వార్డులకు సరఫరా చేస్తున్న పెన్నానది నీటిని అవసరాన్ని బట్టి మరిన్ని వార్డులకు విస్తరించే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ వనరులను కూడా సక్రమంగా వినియోగించకుండా, పైపులైన్ ద్వారా జరుగుతున్న సరఫరాను కొద్ది రోజుల పాటు నిలిపివేయడంతో సమస్య మరింత తీవ్రమైందన్నారు. ఉత్తరకాలువ మరమ్మతుల కారణంగా ప్రధాన సరఫరా నిలిచిపోయిన సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజలకు కనీస అవసరమైన తాగునీటిని కూడా అందించలేని పరిస్థితి ఏర్పడడం మున్సిపల్ పాలన వైఫల్యానికి నిదర్శనమని నాయకులు మండిపడ్డారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద నిర్మించిన మరుగుదొడ్లను కూడా నీటి కొరత కారణంగా ప్రజలు వినియోగించలేకపోతున్నారని, పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 12 ఏళ్ల మున్సిపల్ చరిత్రలో ప్రజలు ఇంత తీవ్ర తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కోలేదని పేర్కొన్నారు.ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాపైనే ఆధారపడే పరిస్థితి తీసుకొచ్చి అధిక బిల్లులు చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రతి వార్డుకు ప్రతిరోజూ సురక్షితమైన తాగునీరు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను కోరారు. సమస్యను అత్యవసరంగా పరిగణించి యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని, లేకపోతే ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మరో రెండు రోజుల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే మహిళలు, ప్రజలతో కలిసి మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపడతామని వైఎస్సార్సీపీ నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు అండ్రా సుబ్బారెడ్డి, తోడేటి మణి, ఇందూరు సురేంద్రరెడ్డి, నోటి వినయ్‌కుమార్‌రెడ్డి, నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు నందవరం ప్రసాద్, పట్టణ మైనారిటి అధ్యక్షులు మీరామొహిద్దీన్, ముజీబుల్లా, షేక్ రహీం, షేక్ పర్వీన్, పట్టణ యువత అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డి, పట్టణ కార్యవర్గసభ్యులు సుబ్బారెడ్డి, నారాయణరెడ్డి, బ్రహ్మనాయుడు, వెంకటేశ్వర్లు, వెంగళరెడ్డి, జనార్ధన్‌రెడ్డి, జమ్రు, మల్లికార్జున, షారూక్, యర్రగుంట్ల మల్లికార్జున, యడ్ల విష్ణు, బాలచెన్నయ్య, యానాదిరెడ్డి, యస్థాని, చైతన్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.