Tuesday, 30 June 2026
  • Home  
  • కేరళలో పేలుడు పదార్థాలతో ఏనుగుల మరణాలు.. మళ్లీ ఆందోళన
- News

కేరళలో పేలుడు పదార్థాలతో ఏనుగుల మరణాలు.. మళ్లీ ఆందోళన

కేరళలో అడవి ఏనుగుల మరణాలు మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎర్నాకുളം జిల్లా మలయట్టూర్ అటవీ ప్రాంతంలో పేలుడు పదార్థాలు నింపిన పండును తినడంతో ఒక మఖ్నా (దంతాలు లేని మగ ఏనుగు) మరణించింది. గత రెండు నెలల్లో ఇదే తరహా ఇది రెండో ఘటనగా అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. అటవీ జంతువులను పంట పొలాలకు రాకుండా అడ్డుకునేందుకు కొందరు అక్రమంగా పేలుడు పదార్థాలు నింపిన పండ్లు ఉంచుతున్నారని అధికారులు తెలిపారు. వాటిని తిన్న ఏనుగులు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోతున్నాయి. 2019 నుంచి 2025 వరకు కేరళలో 744 అడవి ఏనుగులు మరణించగా, వాటిలో 77 మరణాలు మానవ చర్యల వల్లే జరిగాయని అటవీ శాఖ అధ్యయనం వెల్లడించింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. పేలుడు పదార్థాల వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అటవీ శాఖ వెల్లడించింది. అడవి జంతువుల రక్షణకు ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

కేరళలో అడవి ఏనుగుల మరణాలు మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎర్నాకുളം జిల్లా మలయట్టూర్ అటవీ ప్రాంతంలో పేలుడు పదార్థాలు నింపిన పండును తినడంతో ఒక మఖ్నా (దంతాలు లేని మగ ఏనుగు) మరణించింది. గత రెండు నెలల్లో ఇదే తరహా ఇది రెండో ఘటనగా అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.

అటవీ జంతువులను పంట పొలాలకు రాకుండా అడ్డుకునేందుకు కొందరు అక్రమంగా పేలుడు పదార్థాలు నింపిన పండ్లు ఉంచుతున్నారని అధికారులు తెలిపారు. వాటిని తిన్న ఏనుగులు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోతున్నాయి. 2019 నుంచి 2025 వరకు కేరళలో 744 అడవి ఏనుగులు మరణించగా, వాటిలో 77 మరణాలు మానవ చర్యల వల్లే జరిగాయని అటవీ శాఖ అధ్యయనం వెల్లడించింది.

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. పేలుడు పదార్థాల వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అటవీ శాఖ వెల్లడించింది. అడవి జంతువుల రక్షణకు ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.