యాచారం మండలంలోని మల్కీజ్ గూడ గ్రామ కాంగ్రెస్ కమిటీ నియామక పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే రంగారెడ్డి
యాచారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోటె శ్రీశైలం ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే చేతుల మీదుగా గ్రామానికి చెందిన వరికుప్పల యాదయ్య ను గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా
కార్య నిర్వహణ అధ్యక్షుడిగా వరికుప్పల అజయ్ ,
యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గా చీర శ్రీశైలం లకు నియామక పత్రం అందజేశారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ
గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టతకు కృషి చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గడపగడపకు తీసుకెళ్లాలి
అర్హులందరికీ రెండో దప ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు అందిస్తాం
కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేయాలి
నియామక పత్రాలు అందుకున్న కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యే వారికి దిశా నిర్దేశం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు, గ్యాస్ సబ్సిడీ వంటి పథకాలను ఇంటింటికి తీసుకెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు. ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. పార్టీ ప్రతిష్ట గురించి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కొరకు పని చేసే నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
గ్రామంలో నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలని, అంతే కాకుండా పార్టీ బలోపేతానికి అహర్నిశలు పనిచేయాలని కొనియాడారు
ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు ,డిసిసి ఉపాధ్యక్షులు ముత్యాల వెంకటరెడ్డి ,BN రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిల్లకంటి శేఖర్ రెడ్డి, సర్పంచ్ లు దేంది రాంరెడ్డి,కేషమోని రాజు,PACS మాజీ వైస్ చైర్మన్ లిక్కి శ్రీనివాస్ రెడ్డి, వెంకట నరసింహారెడ్డి ,జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోలమోని రామకృష్ణ యాదవ్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పాశం జయప్రకాష్,
గ్రామ నాయకులు గౌరారం వెంకట్ రెడ్డి, చీర శేఖర్, ఉప సర్పంచ్ శిరీష వెంకటేష్ యాదవ్, వార్డు సభ్యులు చీర పద్మ మహేష్, మలిగ విక్రమ్, కొండల్, మాజీ అధ్యక్షులు కొత్తపల్లి జంగారెడ్డి,మధు, జీవన్, యాదయ్య, వెంకటేష్, శ్రీరాములు, యాదయ్య, సుధాకర్, మాజీ వార్డు సభ్యులు సాయిబాబా, త వెంకటేష్, యాదగిరి రెడ్డి, పంతులు నరసింహ తదితరులు పాల్గొన్నారు

