గంజాయి నిర్మూలన, నియంత్రణ, అవగాహన లక్ష్యంగా ‘మెగా కార్డన్ అండ్ సెర్చ్
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, జూలై 12. పున్నమి ప్రతినిధి
జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ ఆదేశాలతో జిల్లాలో ఏక కాలంలో రెండు చోట్ల ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్స్ చేపట్టిన పోలీసు అధికారులు, సిబ్బంది
విజయనగరం సబ్ డివిజన్ పరిధిలో నెల్లిమర్ల పీఎస్ పరిధిలోని డైట్ కాలనీ, చీపురుపల్లి సబ్ డివిజన్ పరిధిలో రాజాం పీఎస్ పరిధిలోని మల్లయ్యపేట వీధిలో సుమారు 60మంది పోలీసు అధికారులు, సిబ్బంది, ఈగల్ సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు
సక్రమంగా రికార్డులు లేని మొత్తం 10 మోటారు సైకిళ్ళు సీజ్ చేసి, సంబంధిత పోలీసు స్టేషనుకు తరలించిన పోలీసు అధికారులు*
జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* ఆదేశాలతో జిల్లాలో జూలై 11న తెల్లవారుజామున 5 గంటల నుండి ఏక కాలంలో జిల్లాలో రెండు చోట్ల ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్స్ నిర్వహించారు. *“ఆపరేషన్ వజ్రప్రహార్”* కార్యక్రమంలో భాగంగా ప్రజల రక్షణ, భద్రత, నేరాలు నియంత్రణ, గంజాయి నిర్మూలన, అనుమానిత వ్యక్తులు, నాటుతుపాకులు, నాటుసారా, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడమే లక్ష్యంగా ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్స్ నిర్వహించామని జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ తెలిపారు.
సుమారు 60 మంది పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ఈగల్ టీం సభ్యలుతో సుమారు 170 ఇండ్లలోను, బహిరంగ ప్రదేశాల్లో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. అపరిచిత వ్యక్తుల వివరాలు సేకరించి, వారి వ్రేలి ముద్రలను ఎం.ఎస్.సి.డి. పరికరాలతో తనిఖీలు చేశామన్నారు. వాహనాల రికార్డులను పరిశీలించి, రికార్డులు సక్రమంగాలేని 10 ద్విచక్ర వాహనాలను తదుపరి చర్యల నిమిత్తం పోలీసు స్టేషనుకు తరలించామన్నారు. అనుమానిత వ్యక్తులు పారిపోయేందుకు అవకాశం ఉన్న మార్గాలను ముందుగా గుర్తించి, ఆయా మార్గాలను పోలీసు బృందాలతో ముందుగానే దిగ్భందనం చేసామన్నారు.
“కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషను అనంతరం పోలీస్ అధికారులు గ్రామస్థులతో సమావేశమై, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలు, రహదారి భద్రత, మహిళల రక్షణ చట్టాలపై గ్రామస్థులకు అవగాహన చేపట్టి, గంజాయి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే 1972కు గాని, డయల్ 100/112కు గాని, స్థానిక పోలీసు స్టేషన్ కు గాని సమాచారం అందించాలని ప్రజలను కోరారు. గంజాయి వలన కలిగే దుష్ప్రభావాలను వివరించి ఎవరు కూడా గంజాయి జోలికి వెళ్ళకుండా ఉండాలని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ తనిఖీల్లో రాజాం సిఐ అశోక్ కుమార్, నెల్లిమర్ల ఎస్ఐ గోపాలరావు, పోలీసు సిబ్బంది, ఈగల్ సిబ్బంది పాల్గొన్నారు.


