విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని రాగి కాయిల్స్‌ను దొంగిలిస్తూ పలు పోలీస్ స్టేషన్ పరిధుల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిజామాబాద్ సిపి సాయి చైతన్య (ఐపీఎస్) మంగళవారం వెల్లడించారు.
వారి వద్ద నుంచి 74 కిలోల రాగి తీగలు, ఒక బజాజ్ మాక్సిమా ట్రాలీ ఆటో, మూడు ద్విచక్ర వాహనాలు, ఐదు సేల్ ఫోన్లు, దొంగతనాలకు ఉపయోగించిన పనిముట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు.



