ఖమ్మం జులై
(పున్నమి న్యూస్ జిల్లా రిపోర్టర్ / పువ్వాడ నాగేంద్ర కుమార్ )
ఖమ్మం నగరంలోని 54వ డివిజన్లో నిర్వహిస్తున్న SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం అమలు తీరుపై బీజేపీ నాయకులు బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) శ్రీమతి రత్న కుమారి గారిని కలిసి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ ఖమ్మం రెండవ పట్టణ ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవరావు, జిల్లా నాయకులు జిల్లెల్ల నాగరాజు SIR కార్యక్రమం నిర్వహణ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు..



