ఖమ్మం
ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా నగరంలోని ఎన్ఎస్పీ అధికారుల అతిథి గృహానికి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌కు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. జిల్లాలోని శాంతిభద్రతలు, పోలీసు వ్యవస్థకు సంబంధించిన అంశాలపై పర్యటన కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.



